క్రైమ్

రూ. లక్షల్లో జీతం..వేధింపులకు యువ టెకీ బలి

సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఓ యువ టెకీ జీవితం పెళ్లయ్యాక ఛిద్రం అయిపోయింది. తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకున్న ఆ యువతి.. వివాహం అనంతరం ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. అత్తింటి వారి నుంచి ఒత్తిడి, వేధింపులు ఎక్కువ అయిపోయాయి.ఓవైపు ఉద్యోగంలో వర్క్ ప్రెజర్.. మరోవైపు అత్తింటి వేధింపులు పెరగడంతో జీవితం మీద విరక్తి కలిగింది. తన బాధను తల్లిదండ్రులకు చెప్పినా వారు ఏమి చేయలేకపోయారు. దీంతో తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర పూణెలోని కేశవ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. 2018లో రాహుల్ అనే వ్యక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని త్రిష్ణకు వివాహం జరిగింది.