వైరల్ న్యూస్

యువతి స్కెచ్‌కు బలైన యువకుడు!

ఏపీలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడిని నిండా ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెళ్లివరకు తీసుకువచ్చిన సదరు యువతి..లాస్ట్ మినిట్‌లో పెళ్లి రద్దు చేసుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో బాధిత యువకుడు కంగుతిన్నాడు. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకున్నట్టు సమాచారం. వివరాల్లోకివెళితే.. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పశుసంవర్ధక శాఖలో కడపకు చెందిన ఓ యువతి ఉద్యోగం చేస్తున్నది.అయితే, అదే జిల్లా వేంపల్లె మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో సదరు యువతికి ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. తనకంటే వయసులో చిన్న వాడైన ప్రసాద్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకునేందుకు యువతి సిద్ధపడింది.