ఏపీ
గుండెపోటుతో యువ డాక్టర్ మృతి.. తండ్రి, భర్త ఇద్దరూ వైద్యులే!
నెల్లూరులో గుండెపోటుతో యువ డాక్టర్ లావణ్య మృతి చెందారు.చిన్న వయసులోనే డాక్టర్ లావణ్య గుండెపోటుతో కన్నుమూయడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. వైద్యం అందేలోపే తుదిశ్వాస విడిచిన సమాచారం. మృతురాలు ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ నరాల వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.లావణ్య న్యూరాలజీలో గోల్డ్ మెడల్ సాధించినట్టు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వైద్య సలహాలు అందిస్తున్నట్టు సమాచారం.అయితే, ఆమె తండ్రి, భర్త ఇద్దరూ వైద్యులే అని తెలిసింది. ఇంట్లో వైద్యులు ఉన్నా ఆమె ప్రాణాలు దక్కకపోవడంతో వారి కుటుంబంలోని వారు మరింత కుంగుబాటుకు గురవుతున్నారు..
