అవును.. నిజంగానే చిరంజీవి తొక్కేశాడు : హైపర్ ఆది
చిరంజీవి నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆయనపై విమర్శలు చేసిన వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఫ్యామిలీని నుంచి సుమారు ఆరుగురు కంటే ఎక్కువ మందే హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ విమర్శలన్నింటీకి హైపర్ ఆది చెక్ పెట్టాడు. ‘అవును.. చిరంజీవి తొక్కేశాడు!.తెలుగు సినిమా ఇండస్ట్రీలో NO.1గా ఎవరు కంటిన్యూ కాలేరు అనే అహంకారాన్ని తొక్కేసి 30 ఏళ్లు NO.1గా ఉన్నాడు. పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్లోనే ఉంటాయి, అది టాలీవుడ్లో సాధ్యం కాదు అనే ఊహలను తొక్కేశాడు. డ్యాన్స్ అంటే నడవడం, హీరోయిన్ చుట్టూ తిరగడం అనే భ్రమను తొక్కేశాడు. హీరోలు అంటే డబ్బులు సంపాదించుకుంటారు అనుకునే వాళ్ల రాంగ్ మైండ్‌సెట్‌ను తొక్కేశాడు. తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవడు అనే ఆలోచనలను తొక్కేసి, కొడుకును తండ్రిని మించిన హీరోగా తయారు చేశాడు’ అని హైపర్ ఆది చేసిన కామెంట్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.
