సినిమా
Yash-Toxic: మ్యాప్‌లో ఇండియన్ సినిమా ఉండాలి..2000 కోట్లు పక్కా!
Yash-Toxic: పాన్ ఇండియన్ సినిమాను.. పాన్ వరల్డ్ సినిమాగా తీసుకెళ్ళేందుకు యష్ ఎంతో శ్రమించాడని దిల్ రాజు అన్నారు. అంతేకాదు, కేజీఎఫ్ సిరీస్ తర్వాత కొత్త దర్శకురాలితో సినిమా చేస్తున్న విషయం తెలిసి షాకయ్యానని అన్నాడు. కేజీఎఫ్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత పెద్ద దర్శకులకి కమిటవుతారు ఏ హీరో అయినా. అలాంటిది, యష్ మాత్రం కథ, దర్శకురాలిపై నమ్మకంతో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చాడని, మన ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా నిలబెట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నాడని, యష్ గురించి పొగడ్తల వర్షం కురిపించాడు దిల్ రాజు. ఇక, ఈ సినిమా గ్యారెంటీగా 2000 కోట్ల వసూళ్ళను రాబడుతుందని దిల్ రాజు ధీమాను వ్యక్తం చేశాడు.
