సినిమా

Yash: "రామాయణ" కోసం ఇగోను పక్కన పెట్టాం

Yash: యష్ నటిస్తున్న మరో గొప్ప చిత్రం బాలీవుడ్‌లో రూపొందుతున్న రామాయణ. తాజాగా, యష్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇందులో, రావణాసుడి పాత్రను ఎందుకు ఎంచుకున్నాడో చెప్పాడు. హీరో బలంగా ఉండాలంటే విలన్ అంతకన్నా బలంగా ఉండాలి. రాముడు మంచితనాన్ని, గుణగణాలను చూపించాలంటే రావణుడిగా నేను బాగా నటించాలి. విలన్ పాత్రలు చేసినా నావంతు బాగా నటించడానికే కృషి చేస్తాను. రామాయణ కోసం మేమంతా ఇగోను పక్కన పెట్టాము.. అని అన్నాడు.