తెలంగాణ
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం..
Yadadri: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం నమోదైంది. 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్ ప్రక్రియలో భాగంగా ఈ యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానించే దిశగా కీలక పురోగతి సాధించారు. 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ప్లాంట్ పూర్తిస్థాయి లక్ష్యం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. మొత్తం 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో ఇప్పటికే నాలుగు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా 5వ యూనిట్ ట్రయల్ రన్‌ను జెన్కో అధికారులు పూర్తి చేశారు. వచ్చే నెల నాటికి 5 యూనిట్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అధికారులు చర్యలు చేపట్టారు.
