తెలంగాణ

Yadadri : బోనాల ఎఫెక్ట్.. యాదాద్రి ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ

హైదరాబాద్ మహానగరంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లష్కర్, లాల్ దర్వాజ, ఉజ్జయిని, బల్కంపేట బోనాలు ముగియడంతో నేడు నగరంలోని గల్లీగల్లీలో బోనాలను ఎంతో వైభవంగా ప్రజలు జరుపుకుంటున్నారు.నిన్న సాయంత్రం నుంచే గల్లీల్లోని అమ్మవారి ఆలయాలను ముస్తాబు చేశారు.ఇక ఎక్కడ చూసినా బోనాల ఫ్లెక్సీలు నగరం నలుమూలలా దర్శనమిస్తున్నాయి. పొలిటికల్ లీడర్లు సైతం తమకు దగ్గరగా ఉండే ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు బోనాలు సమర్పించుకుంటున్నారు. అయితే బోనాల ప్రభావం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై భారీగా పడినట్టు తెలుస్తోంది. యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ తగ్గినట్టు సమాచారం.