తెలంగాణ

Yadadri Bhuvanagiri: రూటు మారుతున్న భూ భారతి.. యజమానులకు తెలియకుండానే 7.18 ఎకరాలు మాయం!..

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరులో భూ భారతి రికార్డులపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు రైతులకు చెందిన సుమారు 7.18 ఎకరాల భూమి.. తమకు తెలియకుండానే మరో వ్యక్తి పేరుపై నమోదైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి విక్రయ లావాదేవీ, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ లేకుండానే పట్టా ఎలా మారిందని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బింగి మల్లయ్యకు చెందిన 1.32 ఎకరాల భూమి బింగి కరుణాకర్ పేరుపై నమోదైందని చెబుతున్నారు. దీనిపై రైతులు గ్రీవెన్స్ డేలో తహసీల్దార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.