తెలంగాణ
అబ్బో సీతాఫలం.. మార్కెట్లో డజన్ కాయల రేటు చూస్తే మైండ్ బ్లాకే!
ఎల్నినో (El Nino) ప్రభావం అన్ని ఆహారపదార్థాలపై పడుతోంది. ఇప్పటికే నీళ్లు లేక రైతులు పంటలు సాగుచేయడం కష్టతరంగా మారింది. ఉద్యాన పంటలకు సైతం ఈ ప్రభావం పడుతోంది. ఎన్నో పోషకాలు ఉండే సీజనల్ పండు సీతాఫలం ధరలు ఇప్పుడు అందనంత ఎత్తుకెళ్తున్నాయి. దిగుబడి భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో డజన్ సీతాఫలాలు రూ.150 నుంచి రూ. 200 వరకు లభించగా, ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన కాయల డజన్ ధర ఏకంగా రూ.400 నుంచి రూ.500వరకు పలుకుతోంది.
