తెలంగాణ
ఆర్ఆర్ ట్యాక్స్ మీద కేంద్రం చర్యలు ఉండవా? :కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, దీనిపై కేంద్రంలోని మోడీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంశంలో బడా భాయ్ మోడీ, ఏబీవీపీ చోటా భాయ్ రేవంత్ రెడ్డిపై ఎప్పటికీ చర్యలు తీసుకోరని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో ఏ బిల్డర్, డెవలపర్‌ను అడిగినా ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వాస్తవమేనని చెబుతారని, చదరపు అడుగుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారనే విషయం అందరికీ తెలుసు అని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అందరికీ తెలిసిన ఈ విషయంపై నేటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
