క్రీడలు
Womens T20: దీప్తిశర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే టాప్ వికెట్ టేకర్‌గా రికార్డు!
ఆకాశమే హద్దుగా సత్తా చాటుతున్న నారీశక్తికి క్రికెట్ మైదానమూ మినహాయింపు కాదని భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మరోసారి నిరూపించింది. సాంకేతిక రంగాలు, పాలన, అంతరిక్ష పరిశోధనల నుంచి క్రీడా ప్రపంచం వరకు ప్రతీ రంగంలోనూ పురుషులకు తీసిపోమని ప్రకటిస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న భారత మహిళా క్రికెట్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అగ్రస్థానాన నిలిచింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దుబాయ్ వేదికగా మహిళల ఆసియా కప్‌లో థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అత్యద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది.
