చిత్రం లేదు
National

దేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం: లోక్‌సభ స్పీకర్

భారతదేశ చరిత్ర, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వంలో మహిళలు ఎల్లప్పుడూ మహత్తర మార్పునకు మార్గదర్శకులుగా నిలుస్తూ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జాతీయ మహిళా కమిషన్ (NCW) ఆధ్వర్యంలో మహిళా శాసనసభ్యుల కోసం నిర్వహించిన రెండు రోజుల జాతీయ సామర్థ్య పెంపుదల వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల్లో ఉన్న సహజసిద్ధమైన నాయకత్వ పటిమను మరింత బలోపేతం చేసేందుకు, వారికి సమాజంలో తగిన ప్రోత్సాహం, సరైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.