వైరల్ న్యూస్
రీల్స్ బానిసైన మహిళ.. నెట్ రావడం లేదని దారుణం
సోషల్ మీడియాకు బానిసై కొందరు వింతగా ప్రవర్తించడం చూసే ఉంటాం.. ఆన్‌లైన్స్ గేమ్స్ ఆడుతూ అందులో లీనమై రాత్రిళ్లు కూడా చేతులు ఫోన్‌ను పట్టుకుని గేమ్స్ ఆడుతున్నట్టు, రీల్స్ షేర్ చేస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. కొందరైతే గేమ్స్ ఆడుతూ సౌండ్స్ చేస్తుంటారు. దానినే నిద్రలోనూ రిపీట్ చేస్తుంటారు. రోజంతా ఫోన్‌తో ఆడటం, అందులో లీనమైపోవడం వల్లే ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక కొందరికి ఫోన్ ఒక వ్యసనంలా మారింది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ రావడం లేదని ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ మహిళ ఫోన్ పగులగొట్టి అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
