తెలంగాణ

ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్ రాహుల్ గాంధీ? : కేటీఆర్

రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారని తెలియడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాహుల్ గాంధీ పర్యటనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావ్ రాహుల్ గాంధీ?’ అంటూ ప్రశ్నించారు. ‘ఉద్యోగాల కోసం పోరాడిన విద్యార్థులపై లాఠీచార్జి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు? లగచర్ల గిరిజన మహిళలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? హైడ్రా కూల్చివేతలతో పేదల ఇళ్లు కూలినప్పుడు మీ స్పందన ఏది? కంచ గచ్చిబౌలిలో వేలాది చెట్ల నరికివేతపై ఎందుకు మౌనంగా ఉన్నారు?రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ఎందుకు స్పందించలేదు? జర్నలిస్టుల అరెస్టులు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఎందుకు నోరు మెదపలేదు? ప్రజా సమస్యలపై ప్రశ్నించని రాహుల్.. ఇప్పుడు రూ.100 కోట్ల ప్రజాధనంతో సభలు, ప్రచార ఆర్భాటాలకా వస్తున్నది? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్ నిలదీశారు.