International

ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తారా? ఇంటర్వ్యూలో ప్రశ్నకు ట్రంప్ సమాధానమిదే!

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై కొత్తగా దాడులు చేయాల్సిన అవసరం వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా ప్రాంతంలో అణు కార్యక్రమం నియంత్రణ, కీలకమైన హర్మూజ్ జలసంధి పునఃప్రారంభం వంటి అంశాలపై జరిపే దౌత్యపరమైన చర్చలు సానుకూలంగా సాగితే అమెరికా వైపు నుంచి మళ్లీ సైనిక చర్యలు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. అయితే, ఒకవేళ తమతో బలమైన ఒప్పందానికి ఇరాన్ ససేమిరా అంగీకరించకపోతే మాత్రం మరోసారి సైనిక దాడులకు వెనుకాడేది లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.