క్రైమ్

పెళ్లయిన 6 నెలలకే భార్య స్కెచ్.. ఆపై అదృశ్యం!

పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళ తన భర్తను కడతేర్చింది.ప్రియుడి కోసం ఈ పని చేయడంతో పాటు మర్డర్ అనంతరం అక్కడి నుంచి జంప్ అయ్యింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపురా జిల్లా ముద్దెబిహాళ్ తాలూకా రుదాగి గ్రామంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. గణేశ్ బసప్ప(27)కు ఆరు నెలల క్రితం అక్షత అనే యువతితో వివాహం జరిగింది. అక్టోబర్ 21 తెల్లవారుజామున గణేశ్ బసప్ప తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. గణేశ్ నిద్రలో ఉన్నప్పుడు అతన్ని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. ప్రియుడితో వెళ్లిపోయేందుకే కట్టుకున్న భార్య అక్షత..భర్తను గొంతు కోసి హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఎందుకంటే హత్య అనంతరం అమె కనిపించకుండా పోయింది. ఆక్షత ప్రియుడు కూడా కనిపించడం లేదని సమాచారం.