క్రైమ్
భర్త వైద్యం కోసం భార్య దారుణం.. ఆమె లేదని భర్త ఘోరం!
భర్త వైద్యం కోసం ఓ భార్య మర్డర్ చేసి బంగారం,నగదు దొంగిలించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేయగా.. భార్య తనకు దూరం అయ్యిందనే బాధ భరించలేక ఆ భర్త తనువు చాలించాలని షాకింగ్ నిర్ణయం తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. భర్త కోసం భార్య త్యాగం చేస్తే ఆమె దూరమైందని ఏకంగా భర్త ప్రాణాలనే తీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో ఈ నెల 24న వృద్ధురాలు పోచమ్మ(75) దారుణ హత్యకు గురైంది. ఈ మర్డర్ చేసింది నర్సమ్మ(46)గా నిర్దారించారు. ఆమెను అరెస్టు చేయగా.. భర్త యాదయ్య వైద్యం కోసం డబ్బులు లేక నేరం చేసినట్టు అంగీకరించింది. భార్య అరెస్టు అయ్యిందని తెలిసి యాదయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు
