క్రైమ్

Crime : భర్త చేసిన తప్పుకు బలైన భార్యా పిల్లలు!

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆవేదనతో ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకివెళితే.. వరంగల్ జిల్లా ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన ఈరెల్లి సుమన్ అనే వ్యక్తి.. హన్మకొండ జిల్లా బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన మమత (30) అనే యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుమన్ ఊరిలో కూలీ పనులు చేస్తుండగా.. మమత నర్సంపేటలోని ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు హరిణి (4), కావ్యశ్రీ (3). ఈ క్రమంలోనే సుమన్.. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 20 రోజుల క్రితం ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. విషయం తెలిసి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా, సుమన్ తన భార్యతోనే ఉండాలని తీర్మానించారు. దీంతో అవమానం తట్టుకోలేక ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి పిల్లలతో సహా బయలుదేరిన మమత.. పాకాల చెరువు వద్దకు చేరుకుని, హైదరాబాద్‌లో ఉండే బంధువులకు చనిపోతున్నానని చెప్పి లొకేషన్ షేర్ చేసింది.

అనంతరం పిల్లలను నడుముకు కట్టుకుని చెరువులోకి దూకింది.