రాజకీయాలు
రేవంత్‌రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పని సోనియా, రాహుల్.. కారణమేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా 'ఇండియా' (INDIA) కూటమిలోని ఏ ఒక్క కీలక నాయకుడు కూడా రేవంత్ రెడ్డికి అధికారిక ప్రకటన లేదా ఎక్స్ (ట్విట్టర్) పోస్టులతోగానీ ఏరకంగానూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు కనిపించలేదు. ఇదే సమయంలో విపక్ష ఎన్డీఏ (NDA) కూటమికి చెందిన ప్రముఖ అగ్రనేతల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారుతోంది.
