National

జంతర్‌మంతర్ రావొద్దనే చెప్పే అధికారం మీకెవరిచ్చారు? : సీజేపీ

ఎస్ఐఆర్ పేరిట ఏకపక్షంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఓవైపు కాంగ్రెస్, మరోవైపు సీజేపీ పార్టీలు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్టోబర్ 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు తరలిరావాలని సీజేపీ పార్టీ యువతకు పిలుపునిచ్చింది. అయితే, జంతర్ మంతర్ వద్దకు ఎవరూ రావొద్దని ఢిల్లీ పోలీసులు సూచించారు. అయితే, ఢిల్లీ పోలీసుల తీరును 'కాక్రోచ్ జనతా పార్టీ'(CJP) తీవ్రంగా ఖండించింది. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు రావొద్దంటూ పిలుపు ఇవ్వడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. ప్రజలు నిరసనలో పాల్గొనాలా? వద్దా? అని అప్పీల్ చేయడానికి పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారు? అని ప్రశ్నించారు.