తెలంగాణ
మహిళా ఎమ్మెల్యేలపై దాడికి స్పందన ఏది?.. సబితమ్మ, సునీతమ్మ ఫైర్!
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు, భద్రతా బృందాలు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక చిట్ చాట్లో అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనలను వివరిస్తూ వారు తీవ్రంగా ఆవేదన చెందారు. అసెంబ్లీ గేట్ల వద్ద మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగుతూ, గొంతు నులిమి భౌతిక దాడులకు పాల్పడితే ఈ ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేకపోవడం దారుణమని మండిపడ్డారు.
