స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
పంచాయతీల జనరల్ ఫండ్ ఎక్కడయ్యా?
తెలంగాణలో కొత్త సర్పంచ్ ల ఆర్ధిక బాధలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో పనులు చేసి అప్పులయినందుకు అత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న సొంత గ్రామ సొత్తు(జనరల్ ఫండ్)ను వాడుకునేందుకు వీలు లేకపోవడంతో చిన్న చిన్న పనులకోసం సర్పంచ్ లు తమ జేబులోంచి ఇవ్వాల్సి వస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి ప్రత్యేక అకౌంట్స్ తీసి నేరుగా జమచేసుకుని, ఖర్చు చేసుకునేలా పంచాయితీ రాజ్ యాక్ట్ 2018 లో సెక్షన్ 70 (3) ని సవరిస్తామని హామి ఇచ్చారు. కాని రెండు నెలలు అయినా ఇంకా అచరణ నోచుకోలేదు. పైగా గత 2 ఏండ్లుగా గ్రామ జనరల్ ఫండ్ సుమారు 500 కోట్లు ట్రెజరీలో మూలుగుతున్నాయి. పంచాయితీ ఇవ్వాల్సిన ఖర్చులకు చెక్స్ ఇస్తే ఇప్పటికి రిలీజ్ చేయని పరిస్థితి ఉంది.
