తెలంగాణ
HydDoubleDeckerBus: డబుల్ డెక్కర్ బస్సులేవి? పర్యాటక శాఖపై విమర్శలు!
హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు గత నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. బతుకమ్మ, దసరా పండుగ సెలవుల నేపథ్యంలో నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను తిలక్షించేందుకు వస్తున్న సందర్శకులకు ఈ పరిణామం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. హెచ్ఎండీఏ (HMDA) నుంచి ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ (Tourism Department).. వాటిని రోడ్డెక్కించడంలో పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో హెచ్ఎండీఏ సుమారు రూ.13కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ట్యాంక్‌బండ్, అసెంబ్లీ, చార్మినార్ వంటి ప్రధాన మార్గాల్లో విజయవంతంగా నడిపారు.
