క్రైమ్
క్యా సీన్ హై.. గంజాయి బ్యాచ్‌తో పోలీసుల దావత్?
నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది.అయితే, నిన్న పెద్దఎత్తున గంజాయి పట్టుబడగా, నిందితులతో పోలీసులు దోస్తానా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న సాయంత్రం ఈగల్ టీమ్స్.. గంజాయి బ్యాచ్ ఇంటిపై దాడులు చేయగా పోలీసులపై నిందితులు కుక్కలను వదిలారు, అంతటితో ఆగకుండా స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశారు.. నిందితులను పట్టుకొని విచారించగా వీరితో బాలానగర్ పీఎస్‌కు చెందిన పోలీసులు కూడా చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినట్లు ఈగల్ టీమ్స్ గుర్తించాయి. ఈగల్ టీం దాడి చేసే కంటే కొన్ని గంటల ముందే నిందితుల ఇంటికి పోలీసులు వచ్చి పార్టీ చేసుకున్నట్లు తెలిసింది.
