వైరల్ న్యూస్

ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

ఓ తల్లి చిన్నారిని ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ‘అమ్మా అమ్మా’ అంటూ ఆ చిన్నారని ఆస్పత్రిలో గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలు అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీలోని ఓ ఆసుపత్రిలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆస్పత్రికి రాగా.. ఓ బిడ్డను ఎమర్జెన్సీ వార్డులో వదిలేసి, మరో బిడ్డను తనతో తీసుకెళ్లింది.ఆకలితో అలమటిస్తున్న ఆ బాబు ‘అమ్మా అమ్మా’ అంటూ ఒకటే గుక్కపట్టి ఏడుస్తూ కనిపించాడు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆ బాబుకు పాలు, బిస్కెట్లు, కొత్త బట్టలను అందించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించగా..అక్కడకు చేరుకున్న ఖాకీలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.