తెలంగాణ

ఏం బూతులు.. ఏం భాష.. సీఎం రేవంత్‌కు ‘గంగుల’ కౌంటర్

నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు వస్తున్నారంటే ఆశపడ్డాం. గత పదేళ్లలో కెసీఆర్ కరీంనగర్‌కు వచ్చినప్పుడల్లా నిధుల వరద పారింది. అలాగే రేవంత్ రెడ్డి వస్తుంటే అదే మాదిరిగా ఉంటుంది అనుకున్నాం. కానీ, ఆరోపణలు, విధ్వంసం..వ్యక్తిగత విమర్శలు తప్ప ఏం లేదు. 1000 రోజుల పాలనలో ప్రశ్నిస్తే డైవర్షన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. చాలా ముఖ్యమంత్రలను చూశాం. కానీ, ఇలాంటి సీఎంను ఎన్నడూ చూడలేదు..ఏం బూతులు, ఏం బాషా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.