తెలంగాణ
పేరు,సంతకం లేకుండా ప్రెస్‌నోట్ విడుదల ఏంటి!!
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లోని భూములపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో సుమారు 700 ఎకరాల భూములపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్న తరుణంలో అందులో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన అంశంపైనా విచారణ జరగాలని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడినట్టు ఓ ప్రెస్‌నోట్ విడుదలైంది. అయితే, ఈ ప్రెస్‌నోట్ ఎవరు విడుదల చేశారు? అతని పేరు, సంతకం లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ ప్రెస్‌నోట్ ఫేక్ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
