తెలంగాణ

జూరాల రైతులకు.. ప్రభుత్వం ఇచ్చిన 3 టీఎంసీల హామీ ఏమైంది?

Jurala Water: కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కొరతతో భూములు నెర్రలువారుతుండగా, పొట్టదశలో ఉన్న పంటలకు సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీటిని విడుదల చేయాలంటూ గత నెలలో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో కర్ణాటక జలాశయాల నుంచి 3 టీఎంసీల నీటిని తెప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, పది రోజులు గడిచినా ఇప్పటివరకు నీరు ఎందుకు విడుదల కాలేదన్న ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీ ప్రకారం నీటిని తీసుకురావడంలో జాప్యానికి కారణమేంటి? కర్ణాటకతో జరిగిన చర్చలు ఏ మేరకు ఫలించాయి? నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.