National

West Bengal: బెంగాల్ పేరు మారుతోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సంచలన ప్రకటన!

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పుపై ఆ రాష్ట్ర స్టేట్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర చారిత్రక వారసత్వం, గుర్తింపును ప్రతిబింబించేలా ‘పశ్చిమ బెంగాల్’ పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. "ఇంకెన్ని సార్లు స్పష్టత ఇవ్వాలి? రాష్ట్ర పేరు ఇకపై 'పశ్చిమ బంగా'గానే ఉంటుంది. అసెంబ్లీలో త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక బిల్లును ప్రవేశపెడతాం" అని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర పేరు మార్పు ప్రక్రియ త్వరలోనే స్టార్ట్ కానుందని తెలిపిన సమిక్ భట్టాచార్య.. ఇకపై ‘పశ్చిమ బంగ్లా’, ‘బంగ్లా’, ‘బంగా’ వంటి అయోమయ పేర్లను యూజ్ చేయాల్సిన పని ఉండదని తేల్చిచెప్పారు.