National
బెంగాల్లో హైటెన్షన్.. మమతా కాన్వాయ్‌పై దాడి!..
పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుకలు, బురద, బాటిళ్లు, చెప్పులతో దాడి కలకలం రేపింది. పోలీసు కస్టడీలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. తనపై రౌడీ మూకలు దాడి చేశాయని మమత ఆరోపించారు. కారు అద్దాలు మూసి లేకపోతే తన తలకు గాయమై, ప్రాణాలు పోయేవని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ దాడితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
