International
Weather Warning: వేడెక్కుతున్న భూగోళం.. మానవాళికి ఐరాస హెచ్చరిక!
మన భూగోళం ఊహకందని రీతిలో వేడెక్కిపోతోంది. మానవాళి మనుగడకే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ వేసవిలో మన కళ్లముందే కనిపించిన విపరీతమైన వేడి, ఊపిరాడని ఉక్కపోత, భయానకమైన అడవుల కార్చిచ్చులు, అనూహ్యంగా ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. ఇవన్నీ రాబోయే రోజుల్లో భూమి ఎంత ప్రమాదకరంగా మారబోతోందో చెప్పే చిన్న శాంపిల్ మాత్రమే అని పర్యావరణ నిపుణులు అంటున్నారు..
