National
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంత ప్రజలు అలర్ట్!..
బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారే అవకాశాలను కూడా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ప్రభావంతో తూర్పు, మధ్య రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
