కాంగ్రెస్ నేతలకు మీనాక్షి వార్నింగ్
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ ప్రక్రియను చేపట్టగా సుమారు 70 లక్షలకు పైగా ఓట్లు గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్గా తీసుకున్నారు.రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున ఓట్లు డిలీట్ అయ్యాయని, కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారని ఆమె సీరియస్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహా పీసీసీ చీఫ్ మిగతా రాష్ట్రస్థాయి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో ఆమె జూమ్ మీటింగ్ నిర్వహించినట్టు తెలిసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 2% ఓట్లతోనే అని గుర్తుచేశారు.ఇకమీదట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా లక్షల ఓట్లు తొలగిపోతున్నాయని, ఆ ఓట్లను కాపాడే బాధ్యత మనదేనని నాయకులకు ఆమె తేల్చి చెప్పినట్టు సమాచారం.
