నల్ల జెండాలతో రాహుల్కు స్వాగతం పలుకుతాం : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో నిర్వహించే భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. ఈ ప్రొగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతోంది. దేశవిదేశాల నుంచి ఇన్వెస్టర్స్, ఎంటర్ ప్రెన్యూర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే, రాహుల్ గాంధీని రాకను తెలంగాణ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.గత ఎన్నికల సమయంలో మోసపూరిత ఆరు గ్యారెంటీలు ఇచ్చారని, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజల తరఫున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది. నవంబర్ 14న 'భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ పాల్గొనడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టంచేశారు.
