తెలంగాణ

సెంచరీ కొడతాం.. ఈసారి వారికే టికెట్లు : మాజీ సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన సన్నిహితుల వద్ద కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలోని ముఖ్యనేతలతో ఇటీవల సమావేశమైన కేసీఆర్.. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికల్లో వస్తే బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని, ‘సెంచరీ’ (వందకు పైగా సీట్లు) కొడతామని పేర్కొన్నట్టు సమాచారం. ఆరు గ్యారెంటీల పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యిందని గుర్తుచేసినట్టు తెలిసింది. అంతేకాకుండా, రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనగా వర్షాలు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, సాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని, అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నట్టు సమాచారం.వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, సాగుకు నీరివ్వకపోవడంతో పంట పొలాలు ఎండుతున్నాయని, దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని పార్టీ ముఖ్యలతో చర్చించినట్టు తెలుస్తోంది.