తెలంగాణ
బీసీ లెక్కల్లో తేడాలుంటే సవరిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన బీసీ కులగణన లెక్కల్లో తేడాలుంటే సవరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీలకు సామాజిక న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరూ చేయని సాహసం తమ ప్రభుత్వం చేసిందని చెప్పారు. ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి తొలిసారిగా బీసీల జనాభా లెక్కలను తేల్చామన్నారు. ప్రస్తుత లెక్కల్లో ఎవరైనా తమ వివరాలు నమోదు కాలేదని భావిస్తే, వాటిని సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అవసరమైతే బీసీ కులగణన లెక్కలను సరిచేసి, జాబితాలోకి రాని వారిని చేర్చుతామన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం ఈ సందర్బంగా కీలక వ్యాక్యలు చేశారు. ఏ కులం వారైనా తమ జనాభా లెక్కల్లో తక్కువగా నమోదైందని భావిస్తే సంబంధిత వివరాలు అందించాలని కోరారు.
