National

గిగ్ వర్కర్లను బానిసలుగా మారుద్దామనుకుంటే చూస్తూ ఊరుకోం : రాహుల్ గాంధీ

పాలసీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు. గిగ్ వర్కర్స్‌ను వెట్టిచాకిరీ కార్మికులుగా మార్చాలని ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. గిగ్ వర్కర్లను బానిసలుగా మార్చాలని, దోపిడీ చేయాలని చూస్తే ఎప్పటికీ సహించేది లేదన్నారు. మిమ్మల్ని సేవకులుగా కాదు.. అభివృద్ధిలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించాలన్నదే తమ పార్టీ ప్రధాన ఆలోచన అని గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ప్రతి ఒక్క డెలివరీలో ఒక శాతం డబ్బు గిగ్ వర్కర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా గిగ్ వర్కర్ల సమాచార వివరాలను ఈజీగా పొందవచ్చని రాహుల్ గాంధీ తెలిపారు. డెలివరీ, శ్రమ, ప్రతిఫలానికి సంబంధించి సమస్త వివరాలు ఇకపై నేరుగా గిగ్ వర్కర్ల మొబైల్ ఫోన్లకే వస్తాయన్నారు. గిగ్ వర్కర్ల కోసం వైఫై సౌకర్యంతో ప్రత్యేక విశ్రాంత భవనాలను సైతం అందుబాటులోకి తెస్తామన్నారు.