తెలంగాణ

2027లోపు పోలీసు శాఖలోని అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఈ రోజు మనందరికీ ఎంతో భావోద్వేగమైన రోజు.. పోలీస్ అమరులను స్మరించుకునే రోజు. సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరులకు నివాళులు’ అని పేర్కొన్నారు. 2027 లోగా పోలీస్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 డీఎస్పీలను నియమించామన్నారు.ట్రాన్స్ జెండర్స్‌ను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచామని, గతంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన కానిస్టేబుళ్ల కు రూ.40 లక్షలు ఎక్స్గ్రేషియా ఉంటే దానిని ఏకంగా రూ. కోటికి పెంచామని తెలిపారు.