తెలంగాణ
ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తాం : టీఆర్ఎస్ చీఫ్ కవిత
రాష్ట్రంలో ప్రస్తుతం ఖైరతాబాద్ ఉపఎన్నిక హాట్‌టాపిక్ అయ్యింది.ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టంచేశారు.శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ డ్రామా నడుపుతోందని పేర్కొన్నారు.ఇదంతా లోపాయికారీ ఒప్పందంలో భాగమే అని ఆరోపించారు.కేటీఆర్ ఫామ్‌హౌస్‌పై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టంచేశారు. ఇది కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే అని.. చేతలు శూన్యం అని విమర్శించారు.
