తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో నిరంతరం పోరాడాలి : హరీశ్ రావు
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ సాధన వరకు ఆయన చేసిన త్యాగం, పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు, స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందాలనే ఉద్దేశంతో వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని గుర్తుచేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడంతో పాటు, ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సమున్నతంగా గౌరవించారని తెలిపారు.
