తెలంగాణ

ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కుల కోసం మనమంతా కలిసి నిలబడాలి : సీఎం రేవంత్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ నాగరికతకు మూలం, ప్రకృతితో మమేకమైన జీవన విధానం - ఆదివాసీ సంస్కృతి అని కొనియాడారు. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను తమ జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, సమిష్టి జీవన విధానం, సాంస్కృతిక పరిరక్షణ యావత్ మానవాళికి మార్గదర్శకం అని పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా, తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.