మాకే టికెట్ దిక్కులేదు.. నీకు కావాలా? :ఇందిరా శోభన్
సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చిట్టా బయటపెడతానని మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ కౌంటర్ ఇచ్చారు. గురువారం గాంధీభవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సుస్మిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వల్ల పక్క పార్టీ వాళ్లు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని, మేము 10, 15 ఏళ్ల నుంచి దొబ్బించుకుంటున్నా.. తమకే ఎమ్మెల్యే టికెట్ రాలేదని, నిన్న గాక మొన్న వచ్చి టికెట్ కావాలంటే ఎలా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ అవినీతి మీద బాంబులు పేలుస్తానని కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘దమ్ముంటే రేవంత్ రెడ్డి అవినీతి బయటపెట్టు.నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు.. నువ్వు చేసే వ్యాఖ్యలకు మీ అమ్మ తల దించుకుంటుంది. బీజేపీ,బీఆర్ఎస్ కలిసి నీతో ఇలా మాట్లాడిస్తున్నారని అర్థం అవుతోంది’ అని ఇందిరా శోభన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
