ప్రపంచం

అమెరికా చదువులు మాకొద్దు.. భారత యువత సంచలన నిర్ణయం

అమెరికాలో చదవాలనే కోరికను భారతీయ విద్యార్థులు తగ్గించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు అయ్యాక ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నవారిలో భారతీయులే ఉన్నారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న వారు, చదువుకుంటున్న వాళ్లు, గ్రీన్‌కార్డు ఉన్నవారు సైతం ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు వణికిపోతున్నారు. స్టూడెంట్ వీసా చార్జీలు పెంచడం, హెచ్ 1బీ వీసా మీద ఆంక్షలు, గ్రీన్ కార్డు ఉన్నవారికి సైతం ఆంక్షలు, రివ్యూలు చేస్తుండటంతో ఇండియన్స్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో చదువుకోసం ఏటా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. అక్కడి UG కోర్సుల్లో భారతీయ విద్యార్థుల దరఖాస్తులు 15 శాతం తగ్గినట్లు సమాచారం. యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనలు కఠినతరం కావడంతో భారతీయ విద్యార్థుల ఉన్నత కలలు చెదిరిపోతున్నాయి.