వ్యాపారం

మేమూ టాప్‌లో ఉన్నాం.. ఏఐ దిగ్గజాలకు మార్క్ జుకర్‌బర్గ్ సవాల్!

 కృత్రిమ మేధస్సులో ఓపెన్ ఏఐ(AI), ఆంథ్రోపిక్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా మైక్రోసాఫ్ట్, గూగుల్ రేసులో నిలవగా, రేసులో కాస్త వెనుకబడిన మెటా (Meta) సంస్థ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అత్యంత అత్యాధునిక మరియు శక్తివంతమైన 'మ్యూజ్ వండర్' (Muse Wonder) అనే కొత్త ఏఐ మోడల్‌ను లాంఛ్ చేసినట్లు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ఈ మోడల్ విడుదలతో ఏఐ పరిశోధనల్లో, నూతన ఆవిష్కరణల్లో తమ సంస్థ మళ్లీ ప్రపంచంలోనే ముందంజలోకి వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు తాము విడుదల చేసిన 'మ్యూజ్ స్పార్క్' కంటే మ్యూజ్ వండర్ మోడల్ పనితీరు అత్యంత వేగవంతంగా, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేలా రూపుదిద్దుకుందని జుకర్‌బర్గ్ వివరించారు.