తెలంగాణ

హైదరాబాద్‌లో నీటి కష్టాలు షురూ.. వాటర్ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్!

 గ్రేటర్ హైదరాబాద్‌లో నవంబర్ ప్రారంభంలోనే తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. సాధారణంగా వేసవిలో కనిపించే నీటి ఎద్దడి దృశ్యాలు, ఈసారి చలికాలం ఆరంభంలోనే నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో (El Niño) ప్రతికూల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. వర్షాభావం వల్ల నగర పరిధిలోని భూగర్భ జలాలు వేగంగా పడిపోయాయి. పర్యవసానంగా నగరవ్యాప్తంగా బోర్లలో నీళ్లు అడుగంటిపోతున్నాయి.