తెలంగాణ

బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. ఆన్‌లైన్‌లో క్లాసులు

వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకునే బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కనీస తాగునీటి సౌకర్యం కూడా కరువైనట్టు సమాచారం. క్యాంపస్‌లో నీళ్లు లేని దుస్థితిలో విద్యార్థులకు నవంబర్ 17 వరకు ఆన్‌లైన్ క్లాసులు ప్రకటించినట్టు తెలిసింది.దీంతో అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాన్ని విద్యార్థులు వేలెత్తి చూపిస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తమకు ఏమి సంబంధం లేదని, ప్రభుత్వం నుంచి సహకారం లేదని చేతులు దులుపుకుంటున్నట్టు తెలుస్తోంది. అంత పెద్ద విద్యాసంస్థలో కనీసం తాగు నీటి సౌకర్యం కల్పించకపోవడం పాలకుల పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.