తెలంగాణ
కొల్లాపూర్లో వాటర్ వార్.. కాలువ నీటి పంపిణీపై రైతుల ఘర్షణ!
ఎల్నినో ప్రభావంతో సాగు, తాగునీటికి కష్టాలు అధికమవుతున్నాయి. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో సాగునీటి పంపిణీకి సంబంధించి రెండు గ్రామాల రైతుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పాన్గల్ మండల పరిధిలో ప్రవహిస్తున్న భీమా కాలువ ద్వారా జూరాల ప్రాజెక్టు నీటిని మళ్లించే వ్యవహారంలో మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
