తెలంగాణ
ఆల్మట్టికి జలకళ.. నిండుతున్న రిజర్వాయర్!..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టికి 32 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 26 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు 21 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5,800 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఇక జూరాలకు 24 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 20,705 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా మూడు ప్రాజెక్టుల్లోనూ భారీగా నీటి నిల్వలు కొనసాగుతున్నాయి.
