తెలంగాణ
హైదరాబాద్కు నీటి గండం.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హెచ్చరిక!
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య మళ్లీ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోవడంతో రాబోయే వేసవి కాలంలో నగరవాసులకు తీవ్ర నీటి కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. నీటి వృథాను నివారించి, పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
